రేగోడు జులై 27 తెలంగాణ ఎక్స్ ప్రెస్, వర్షాలు బాగా కురవడం వల్ల పల్లెల్లో పచ్చని ప్రకృతిలో భాగంగా ఇంటింటికి మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని రేగోడు మండల కేంద్రంలో సర్పంచ్ బాదనపల్లి నర్సింలు, పంచాయతీ కార్యదర్శి రాములు, ఫీల్డ్ అసిస్టెంట్ పట్లోళ్ల శివకుమార్ ఆధ్వర్యంలో మొక్కలు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఇంటిలో ఖాళీగా ఉన్న ఆవరణలో మొక్కలను నాటలని,మొక్కలు పెంచినట్లయితే మంచి ఆరోగ్య కరమైన వాతావరణంలో చల్లని గాలులు,వాతావరణ సతుల్యత దెబ్బతినకుండా ఉంటుందని,సకాలంలో వర్షాలు పడతాయని అన్నారు. ఎవరైనా ఇంటి ఆవరణలో ఖాళీ ప్రదేశం ఉన్నట్లయితే మాకు తెలియజేసినట్లైతే మొక్కలు పంపిణీ చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో రేగోడు పారిశుద్ధ కార్మికుల బృందం గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
పచ్చని ప్రకృతికి హరితహారం ఇంటింటికి మోక్కలు పంపిణీ.
37
previous post