- తహసిల్దార్ తుకారం
ముధోల్, జూలై 27(తెలంగాణ ఎక్స్ ప్రెస్ )
ఎడతెరిపు లేకుండా కురుస్తున్న భారీ వర్షాల తో ప్రమాదాలు జరిగే అవకా శం ఉన్నందున ప్రజలందరూ అప్రమ త్తంగా ఉండాలని ముధోల్ తహసిల్దార్ తుకారం సూచించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యవసరం ఇంటి తప్ప బయటకి ఎవరు రా వద్దని కోరారు. వర్షానికి తడి సిన విద్యుత్ స్తంభాలను గోడలను తాకకూడదు అన్నారు. వాటికి విద్యుత్ సరఫరా అయ్యి ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందన్నారు. ఇంటిపై వేసిన ఇనుప రేకులను తాకకూడదు. శిధిలా వ్యవస్థలో ఉన్న ఇండ్లలో మట్టి గోడలతో కట్టిన ఇల్లు నివాసం ఉండ కూడ దని సూచించారు. రైతులు పంట పొలాలకు వెళ్ళరాదు అన్నారు. పిడుగులు పడుతున్న సందర్భంలో సెల్ ఫోన్లు ఉపయోగించకూడదని చెప్పారు. వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్న సమయంలో వాగు దాటే ప్రయత్నం చేయకూడదు అన్నారు. ఇండ్లు,చెరు వులు , కుంటలు, తెగిపోయినట్లయితే గ్రామ రెవెన్యూ సహాయకులు మండల గిర్ధవార్ కు సమాచారాన్ని అందజేయాలన్నారు .