మంచిర్యాల, జులై 26, (తెలంగాణ ఎక్స్ ప్రెస్): మంచిర్యాల జిల్లాలో కుండపోత వాహనలతో జనజీవనం అస్తవ్యస్తమైంది, బుధవారం జిల్లాలో 40 మీల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కావడం జరిగిందని వర్షపాతం నిపుణులు తెలియజేశారు. జిల్లాలోని కొండ వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహించడంతో గ్రామాలలో జనాలకు తీవ్ర ఇబ్బంది ఎదురైంది. కుండపోత వానలతో పాటు పక్క జిల్లా నిర్మల్ కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో గోదావరి నది నుండి ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి అధిక నీరు చేరడం జరుగుతుంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి దిగువకు 12 గేట్ల ద్వారా నీటిని వదిలివేశారు. నది పరివాహక గ్రామాలలో జనాలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కొమురం భీం జిల్లా కొండ వాగులు వంకల ద్వారా వరద తాకిడి ఎక్కువ కావడంతో రాళ్లవాగు ఉప్పొంగి ప్రవహిస్తుంది. జిల్లా పట్టణ కేంద్రంలోని పరివాహ ప్రాంతంలో జనాలు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. వర్షం ఎక్కువగా కురియడంతో జనాలు రోడ్డు పైకి రాలేక పంట సరుకులు లేక ఇబ్బందులు ఎదుర్కొటుంన్నారు. కుండపోత వానలతో జనాలు బయటికి రావద్దని అత్యవసర సమయంలో మాత్రమే బయటకు రావాలని అధికారులు సూచించారు. మరో రెండు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉంటుందని అధికారులు తెలియజేశారు. జిల్లాలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వర్షపాతం నిపుణులు తెలిపారు.
జిల్లాలో కుండపోతా వానలతో జనజీవనం అస్తవ్యస్తం
60
previous post