మిర్యాలగూడ, జులై 26, (తెలంగాణ ఎక్స్ ప్రెస్)
ఖరీఫ్ సీజన్ మొదలైన నేపథ్యంలో అధికారులు రైతులకు అందుబాటులో ఉండాలని వ్యవసాయ శాఖ మిర్యాలగూడ సహాయ సంచాలకులు పోరెడ్డి నాగమణి అన్నారు.మిర్యాలగూడ రైతు వేదిక లో డివిజన్ లోని మండల వ్యవసాయ అధికారులు, విస్తరణ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతు బీమా పథకంలో 18 నుండి 59సంవత్సరాలు లోపు ఉన్న ప్రతి రైతు బీమా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
గతంలో రైతు బీమా చేయించుకున్న రైతులు వారు ఏదైనా సవరణలు ఉన్నచో వ్యవసాయ విస్తరణాధికారిని సంప్రదించి ఈనెల 30వ తేదీలోగా సవరించుకోవాలని కోరారు. గతంలో కానీ,కొత్తగా పట్టాదారు పాసుబుక్ వచ్చి రైతు బీమా నమోదు చేసుకొని రైతులు ఆగస్టు 5 వ తేదీ లోపు రైతు బీమా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు ,రైతు బీమా దరఖాస్తు కు రైతు ఆధార్ కార్డు, పట్టేదార్ పాస్ పుస్తకం, నామిని ఆధార్ కార్డు జిరాక్స్ లో దరఖాస్తు ఫారం కు జత చేసి రైతు స్వయంగా వ్యవసాయ విస్తరణ అధికారులకు రైతు వేదికలో అందజేయాలని తెలిపారు. అదేవిధంగా పంటల నమోదు కార్యక్రమాన్ని జాగ్రత్తగా రైతుల సర్వే నెంబర్ వారీగా ఏఏ పంటలు వేశారు ఆన్లైన్లో వ్యవసాయ విస్తరణ అధికారులు నమోదు చేయాలని సూచించారు.
రైతాంగానికి అధికారులు అందుబాటులో ఉండాలి :ఏ డి పోరెడ్డి నాగమణి
51