మిర్యాలగూడ డివిజన్ జులై 26 తెలంగాణ ఎక్స్ ప్రెస్: భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ సంఘర్షణ సైకిల్ యాత్ర మిర్యాలగూడ పట్టణంలో చేరుకోగానే ప్రజాసంఘల నాయకులు యాత్రకు సంఘీభావం తెలుపుతూ సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికారి మల్లేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ* విద్య బలోపేతంకై ఎస్ఎఫ్ఐ నిర్వహిస్తున్న సంఘర్షణ సైకిల్ యాత్ర స్వాగతం తెలుపుతూ పేద మధ్యతరగతి విద్యార్థులు చదువుకునే పాఠశాలలో సంక్షేమ హాస్టల్లో గురుకులల్లో అనేక సమస్యలతో స్వాగతం పలుకుతున్నాయి పెరుగుతున్న ధరలకు అనుకూలంగా మెస్ కాస్మోటిక్ చార్జీలు పెంచకుండా అరకోరా చార్జీలు పెంచి ఆర్భాటాలకు పరిమితమైనరు తప్ప పేద విద్యార్థులకు సంపూర్ణంగా భోజనం పెట్టడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు పెండింగ్ చార్జీలు విడుదల నేటికి చేయకపోవడం సిగ్గుచేటు అన్నారు మిర్యాలగూడ ప్రాంతంలో అనేకసార్లు అధికారులకు మహిళా జూనియర్ కళాశాల డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని విన్నవించుకున్న ప్రభుత్వ యంత్రాంగం స్పందించకపోవడం బాధాకరమన్నారు ఇప్పటికైనా ప్రభుత్వ మహిళ జూనియర్ డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు నియోజకవర్గం లో అనేక ప్రభుత్వ విద్యాసంస్థలను సంవత్సరాల తరబడి పూర్తిస్థాయిలో నిర్మించలేకపోవడం విద్యార్థుల శాపమా.. కాంట్రాక్టు నిర్లక్ష్యమా.. అధికారుల కమిషన్ల కోసమా.. ఏ రీతిలో అర్థం చేసుకోవాలో అర్థం కావడం లేదు తక్షణమే ప్రభుత్వం పెండింగ్ భవనాల బిల్లును విడుదల చేసి పూర్తి చేసి బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నల్లగొండ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆకారపు నరేష్, ఖమ్మంపాటి శంకర్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రవి నాయక్, ఎస్ఎఫ్ఐ మిర్యాలగూడ డివిజన్ కార్యదర్శి కుర్ర సైదానాయక్, సిఐటియు నాయకులు గౌతమ్ రెడ్డి, మంగారెడ్డి, పాండు, డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు పతాని శీను, ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు లక్ష్మణ్, రమేష్, జగన్, వీరన్న, నుమన, తరుణ్ తదితరులు పాల్గొన్నారు
విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి ఎస్ఎఫ్ఐ సంఘర్షణ సైకిల్ యాత్ర బృందం డిమాండ్
22
previous post