- సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన కులాలను అభివృద్ధి చేయడమే సాహూ మహారాజు లక్ష్యం
- నియోజకవర్గ బహుజన సమాజ్ పార్టీ ఇన్చార్జి పాలెం వెంకటయ్య
మక్తల్. జులై. 26 : -( తెలంగాణ ఎక్స్ ప్రెస్) : కొల్హాపూర్ సంస్థాన మహరాజు ఛత్రపతి సాహూమహరాజ్ తన రాజ్యంలో వెనుకబడిన కులాలకు 50 రిజర్వేషన్లు కల్పించిన సందర్బంగా ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ మక్తల్ నియోజకవర్గం ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో బీఎస్పీ నాయకులు ఘనంగా రిజర్వేషన్ డే నిర్వహించారు.
ఈ సందర్భంగా మక్తల్ నియోజకవర్గ ఇంఛార్జీ పాలెం వెంకటయ్య గారు ఛత్రపతికి సాహుజీ మహరాజ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు వెంకటయ్య గారు మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేడ్కర్ భారత రాజ్యాంగం ద్వారా రిజర్వేషన్లు కల్పించడానికి నలభై సంవత్సరాల క్రితమే ఈ దేశంలో పేదలకు రిజర్వేషన్లు అమలు చేసిన మహనీయులు సాహు ఛత్రపతి సాహు మహరాజ్. సమాన అవకాశాలు,ఎవరి జనాభా ఎంతో,వారికి అంత వాటా అనే సామాజిక న్యాయ సూత్రాన్ని పాటిస్తూ దేశానికి ఆదర్శప్రాయంగా నిలిచారు సాహు మహరాజ్ గారు . ఆ మహనీయుని అడుగుజాడల్లోనే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు జనాభా నిష్పత్తి ప్రకారం అసెంబ్లీ సీట్లు కేటాయిస్తానంటున్నాడు.బిఆర్ఎస్,కాంగ్రెస్, బిజెపి పార్టీలు జనాభా నిష్పత్తి ప్రకారం సీట్లు కేటాయించే దమ్ము లేదు. అందుకే జనాభా నిష్పత్తి ప్రకారం అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా బీసీలు ఉండాలంటే బహుజన సమాజ్ పార్టీని ఆదరించాలని వారు తెలియజేశారు. రాబోయే రోజుల్లో బహుజన సమాజ్ పార్టీ లోనికి అధికారం అధికారంలోకి రాగానే జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు కల్పించే దిశగా ప్రయాణం చేస్తుందని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ నారాయణపేట జిల్లా ఇంచార్జి అర్జున్ రాజ్, జిల్లా మైనారిటీ కన్వీనర్ MD అమీర్,జిల్లా ప్రధానకార్యదర్శి జుట్ల నరేందర్,జిల్లా ఆర్గనైసింగ్ సెక్రెటరీ బండారు చంద్రశేఖర్, మక్తల్ మండల అధ్యక్షుడు పరుశురాం తదితరులు పాల్గొన్నారు.