నాగిరెడ్డిపేట , జూలై 26:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్)మండలంలోని నాగిరెడ్డిపేట గ్రామ పంచాయతీ రికార్డులను బుధవారం స్థానిక ఎంపీఓ శ్రీనివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పంచాయతీ పరిధిలో ఎక్కడ కూడా నీటి నిల్వలు ఉండకుండా చూసుకోవాలి అని సూచించారు.నీటి నిల్వలు ఉన్నచోట ఆయిల్ బాల్స్ వేయాలని,పిచ్చి మొక్కలను తొలగించాలని, పారిశుద్ధ్యం నిర్వహణ,మురికి కాలువలో బ్లీచింగ్ పౌడర్ వేసి,గ్రామపంచాయతీ పరిధిలో సాయంత్రం సమయం ఫాగింగ్ చేస్తూ దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని తద్వారా ప్రజలకు ఎలాంటి అంటువ్యాధులు ప్రబలకుండా ప్రతి వార్డ్ ను శుభ్ర పరచడానికి అవసరమైన చర్యలు తీసుకోని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి అని పంచాయితీ సెక్రటరీకి సూచించరు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సునీత వెంకట్ రెడ్డి పంచాయతీ సిబంది తదితరులు పాల్గొన్నారు
పంచాయతీ రికార్డులను పరిశీలించిన ఎంపీఓ
108
previous post