
మిర్యాలగూడ జులై 25 (తెలంగాణ ఎక్స్ ప్రెస్) ఉచిత మెడికల్ క్యాంపు లో సద్వినియోగం చేసుకోవాలని లయన్స్ క్లబ్ మిర్యాలగూడ అధ్యక్షులు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కర్నాటి రమేష్ లు కోరారు. మంగళవారం స్థానిక రైస్ మిలర్స్ భవనంలో ,లయన్స్ క్లబ్ సౌజన్యంతో హైదరాబాద్ యశోద హాస్పిటల్ వారి సహకారంతో ఏర్పాటుచేసిన ఉచిత మెడికల్ క్యాంప్ ను ప్రారంభించిన అనంతరం కర్నాటి రమేష్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ఆరోగ్య పరిరక్షణ కోసం తమ వంతు సహాయంగా గుండె, ఎముకలు, సాధారణ వ్యాధులకు సంబంధించిన పరీక్షలతో పాటు అతి తక్కువ ఖర్చుతో గుండెకు సంబంధించిన టుడి ఈకో పరీక్షలను నిర్వహించారని తెలిపారు. ఈ క్యాంపులో సుమారు 150 మంది వరకు పరీక్షలుచేయించుకున్నారని,వారికి జనరల్ చెకప్ తో పాటు కార్డియాలజీ, ఆర్థోపెడిక్ పరీక్షలు నిర్వహించారు.ఈ కార్యక్రమం యశోద హాస్పిటల్ డాక్టర్ లోకేష్ కుమార్ గుప్తా, కార్యక్రమం లో లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ సెక్రటరీ మాశెట్టి శ్రీనివాస్ (డైమండ్) రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు గుడిపాటి శ్రీనివాస్, కార్యదర్శి వెంకటరమణ చౌదరి ( బాబి) కార్యదర్శి రంగా లింగయ్య, కోశాధికారి పైడిమర్రి సురేష్, లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ ఉపాధ్యక్షులు కోలా సైదులు ముదిరాజ్, కార్యదర్శి యనగండ్ల లింగయ్య, కోశాధికారి బాబురావు, సీనియర్ లయన్స్ డాక్టర్ రాజు, వర్షిత హాస్పిటల్ యజమాని డాక్టర్ రాంబాబు, లయన్ బి. ఎం. నాయుడు గుండా రామారావు లతో బాటు లయన్ మెంబర్స్, రైస్ మిల్లర్స్ పాల్గొన్నారు.