Home Latest దత్తత గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎక్కడప్రజల బతుకులు మారేది కాంగ్రెస్ తోనేప్రజాహిత పాదయాత్రలో జనంపల్లి అనిరుధ్ రెడ్డి వెల్లడి

దత్తత గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎక్కడప్రజల బతుకులు మారేది కాంగ్రెస్ తోనేప్రజాహిత పాదయాత్రలో జనంపల్లి అనిరుధ్ రెడ్డి వెల్లడి

by Telangana Express

రాజాపూర్ జూలై 25:- (తెలంగాణ ఎక్స్ ప్రెస్) రాజాపూర్ మండల్ లో కొనసాగుతున్న ప్రజాహిత పాదయాత్ర మంగళవారం దొండ్లపల్లి, గ్రామం నుండి మొదలై తిర్మలాపూర్, చేన్న వెళ్లి, కుచ్చర్ కల్, మీదుగా రాజాపూర్ చేరుకుంది రాజాపూర్ ముఖ్య కూడలిలో జనంపల్లి అనిరుద్ రెడ్డికి కాంగ్రెస్ నాయకులు క్రేన్ సాయంతో భారీ గజమాల వేసి స్వాగతం పలికారు.ఈ సందర్భంగా టిపిసిసి ప్రధాన కార్యదర్శి జనంపల్లి అనురుధ్ రెడ్డి మాట్లాడుతూ.చేక్కంపేట్ గ్రామంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు బిఆర్ఎస్ నాయకులు 30 వేల రూపాయలు లంచం అడుగుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారని బిఆర్ఎస్ నాయకులపై మండిపడ్డారు.ప్రజల బ్రతుకులు కాంగ్రెస్ ప్రభుత్వం తోనే బాగుపడతాయని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.జడ్చర్ల నియోజకవర్గంలోని పలు మండలాల్లో భారత రాష్ట్ర సమితి నాయకులు అవినీతి చేస్తున్నట్టు తన దృష్టికి వచ్చిందని, త్వరలోనే అలాంటి వారిని గుర్తించి వారి చిట్టాను బయటకు తీస్తానని టిపిసిసి ప్రధాన కార్యదర్శి జనంపల్లి అనిరుధ్ రెడ్డి పేర్కొన్నారు.భూ దందాలు, అక్రమ వెంచర్లు నెలకొల్పుతూ ప్రజలను మోసం చేస్తున్న వారి జాబితాను త్వరలోనే బయటికి తీస్తానని అన్నారు.పేదలకు అండగా ఉంటూ వారిని ఆదుకున్న ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్ర ప్రజలకు చేతకాని హామీలు ఇస్తూ ప్రజలను మభ్య పెడుతూ వస్తున్నారన్నారు.దళితులకు మూడు ఎకరాల భూమి, నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వడంలో కెసీఆర్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి రాజాపూర్ దత్తత తీసుకున్న గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎక్కడ అని ప్రశ్నిస్తూ మండలంలో నేటికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించలేకపోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు.ఎన్నికలు సమీపిస్తున్న వేళ బిసి కుల వృత్తులకు లక్ష రూపాయలు రుణమంటూ వారిని మభ్యపెడుతున్నారన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో గద్దెనెక్కుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.కర్ణాటక రాష్ట్రంలో ఆ రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పు తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే తీర్పు రాబోతోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.రాజాపూర్ ముఖ్య కూడ లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి మళ్లీ పాదయాత్రను ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రబ్బాని, రంగారెడ్డి గూడా ఎంపీటీసీ భర్త శ్రీను నాయక్, కత్తెర కృష్ణయ్య, వెంకట్ నాయక్, నసీర్ బైగ్, పోలేపల్లి యాదయ్య, రమేష్ రెడ్డి, గోనెల రమేష్, వనపర్తి రమణ, మంగలి యాదగిరి, శివకుమార్, తక్కీ బాబా, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

You may also like

Leave a Comment