శంకరపట్నం జూలై 24:-( తెలంగాణ ఎక్స్ ప్రెస్) శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామానికి చెందిన సముద్రాల సంపత్ కు దళిత రత్న అవార్డును సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదివారం తన కార్యాలయంలో అందించారు. మాదిగ హక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్న సంపత్ దలితుల అభ్యున్నతి కోసం పాటుపడుతూనే, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం, నిరుపేదలకు సహాయం చేయడం, గ్రామంలో స్వచ్చంద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరి మన్ననలు పొందుతున్నాడు. అంబేద్కర్ జయంతి ని పురస్కారించుకొని అందించే ఈ అవార్డును సంపత్ పొందడంతో గ్రామస్థులు, దళిత సంఘాల నాయకులు, వివిధ కుల సంఘాల నాయకులు, స్వచ్చంద సంఘాల నాయకులు, ఆయన శ్రేయోభిలాషులు హర్షం వ్యక్తం చేశారు. తను దళితుల అభ్యున్నతికి, చేస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తించి ఈ అవార్డు అందించిన మంత్రి కొప్పుల ఈశ్వర్ కు, తనకు సహకరించిన మాజీ ఎమ్మెల్యే ఆరేపెల్లి మోహన్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
దళిత రత్న అవార్డు అందుకున్న సంపత్
64
previous post