జుక్కల్ జులై 24:-( తెలంగాణ ఎక్స్ ప్రెస్)
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండల కేంద్రంలో,నూతనంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల మద్నూర్ లో స్పెషల్ ఫేస్ ఆన్లైన్ లో దోస్త్ ద్వారా డిగ్రీలో ప్రవేశం కొరకై 01/ 08/ 2023 నుండి 11 /8 /2023 వరకు అప్లై చేసుకోగలరని కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ చంద్రముఖర్జీ గారు తెలిపారు. ఈ కళాశాలలో బిఎ, బీకాం, బీఎస్సీ లైఫ్ సైన్స్, బీఎస్సీ ఫిజికల్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం కోర్సుల గాను ఆసక్తి గల విద్యార్థులు అప్లై చేసుకోగలరు. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ చంద్రముఖర్జీ గారు ఒక ప్రకటన లో తెలిపారు.