హవెలిఘనాపూర్ మండలం జులై 22 🙁 తెలంగాణ ఎక్స్ ప్రెస్ )
హవేలి ఘనపూర్ మండలం కూచంపల్లి గ్రామంలో నేడు అనగా శనివారం రోజున గౌరవ ఎమ్మెల్యే శ్రీమతి పద్మాదేవేందర్ రెడ్డి గారు గ్రామానికి విచ్చేసి ఐదు రోజుల నుండి పడుతున్న వర్షాలు దాటికి కూలిన ఇళ్లను పరిశీలించడం జరిగింది . గ్రామంలో భాగంగా మంగళ శ్రీహరి , సాల వెంకటి , ఇతరుల బాధితుల ఇళ్ళను పరిశీలించి బాధితులకు అండగా ఉంటానని ధైర్యాన్ని చెప్పారు . బాధితుల కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ ఎలాంటి ఆందోళనలు పడకూడదని ధైర్యాన్ని ఇచ్చి పరామర్శించారు . ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని హామీ ఇచ్చారు . అలాగే విస్తారంగా కురుస్తున్న వర్షాలకు రైతులు , ప్రజలు అప్రమత్తంగా ఉండి , కావలసిన అవసరాల కోసం మాత్రమే బయట ప్రాంతాలలోకి వెళ్లాలని సూచించారు .
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జండాకాడి దేవా గౌడ్ , మెదక్ జిల్లా ఆత్మ కమిటీ అధ్యక్షులు అంజా గౌడ్ , బి ఆర్ ఎస్ వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడాల సతీష్ , ఆత్మ కమిటీ డైరెక్టర్ వీరప్పగారి కిష్టాగౌడ్ , చినూర్ శ్రీనివాస్ రెడ్డి , లింగంపల్లి శేఖర్ రెడ్డి , మార్కెట్ కమిటీ డైరెక్టర్ సాప సాయిలు , బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి , సుభాష్ వార్డ్ నెంబర్ , తోట సత్యనారాయణ , కుకుట్ల బయన్న , ఆకుల రజిత – యాదగిరి , గణపురం వెంకటి , గ్రామ ప్రజలు , బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు , తదితరులు పాల్గొన్నారు .