Home తాజా వార్తలు విద్యార్థులు రక్త నమూనాలను తెలుసుకొని ఉండాలి

విద్యార్థులు రక్త నమూనాలను తెలుసుకొని ఉండాలి

by V.Rajendernath


ముధోల్. జూలై24(తెలంగాణ ఎక్స్ ప్రెస్)విద్యార్థులు రక్త నమూనాలను తెలుసుకొని ఉండాలని వైద్యులు సువర్ధన్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు క్షేత్ర పర్యటనలో భాగంగా రక్తవర్గీకరణ వర్గాల, వ్యాధి నిర్ధారణ పరీక్షలను గురించి ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా వైద్యులు సువర్ధన్ మాట్లాడు తూ విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో రక్త నమూనాలో చేసే పద్ధతి వాటి యొక్క వర్గీకరణ గ్రూపులను క్లుప్తంగా వివరించారు. అదేవిధంగా విద్యార్థులకు వైద్యులు రక్తవర్గీకరణ విషయాలను తెలుసుకొని సందేహాలను నివృత్తి చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో ప్రధాన చార్యులు సారథి రాజు ఆచార్యులు జీవన్ విద్యార్థులు ఉన్నారు

You may also like

Leave a Comment