ఎల్లారెడ్డి, జులై 24,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):
ఎల్లారెడ్డి ఆర్డీవో గా రాథోడ్ రమేష్ , సోమవారం భాద్యతలు స్వీకరించారు. ఇంతకు ముందు ఇక్కడ ఆర్డీవో గా విధులు నిర్వహించిన ఎస్.శ్రీను రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి ఆర్డీవో గా బదిలీ కాగా, ఆయన స్థానంలో ఆదిలాబాద్ ఆర్డీవో గా విధులు నిర్వహించిన రమేష్ రాథోడ్ ఎల్లారెడ్డి ఆర్డీవో గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆర్డీవో కార్యాలయం డిఎఓ మోతి సింగ్, సిబ్బంది, డివిజన్ పరిధిలోని ఎల్లారెడ్డి, లింగం పేట్, నాగిరెడ్డి పేట్, గాంధారి మండలాల తహశీల్దార్ లు జి.సుధాకర్, చంద్ర రాజేశ్వర్ రావు, సయీద్ అహ్మద్ మాస్రూర్ , గోవర్ధన్ లు మర్యాద పూర్వకంగా నూతన ఆర్డీవో ను కలిసి పుష్ప గుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత నూతన ఆర్డీవో మాట్లాడుతూ, డివిజన్ పరిధిలోని అందరి అందరి సహకారం తో ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని, ప్రజలకు ఏమైనా సమస్యలుంటే నేరుగా తన దృష్టికి తీసుకు రావాలని అన్నారు. అధికారులకు , ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని అన్నారు. పిదప మండల వి ఆర్ ఎ ల సంఘం అధ్యక్షులు ఏగుల నర్సింలు అధ్వర్యంలో మండల విఆర్ఎ లు సైతం ఆర్డీవో ను మర్యాద పూర్వకంగా కలిసి శాలువా కప్పి పూల బొకే అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.