Home తాజా వార్తలు కుండపోత వానలతో పొంగిపొర్లుతూన్న వాగులు రోడ్డుపై కరెంటు స్తంభాలు భారీ వృక్షాలు నేలకోరిగాయి

కుండపోత వానలతో పొంగిపొర్లుతూన్న వాగులు రోడ్డుపై కరెంటు స్తంభాలు భారీ వృక్షాలు నేలకోరిగాయి

by V.Rajendernath

మంచిర్యాల, జులై 22, (తెలంగాణ ఎక్స్ ప్రెస్): గత నాలుగు రోజులుగా కురుస్తున్న గుండెపోత వానలతో వాగులు పొంగిపొర్లుకు, రోడ్డుపై కరెంటు స్తంభాలు భారీ వృక్షాలు నేలకొరిగాయి. కవ్వాల అభయ రణ్యం అటవీ ప్రాంతం నుండి వరద ఎక్కువ రావడం శుక్రవారం రాత్రి కురిసిన వానతో మంచిర్యాల జిల్లా జన్నారం మండలం వాగు పొంగిపొర్లుతూ వరద ఎక్కువ కావడంతో శివారులో ఉన్న బుడుగ జంగాల ఇండ్లలోకి నీరు ప్రవేశించాయి. దీంతో వానలో రాత్రి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మంచిర్యాల నిర్మల్ వైపు రహదారిపై వెళ్లే వాహనాలు జన్నారం మండలం చింతగూడ బస్ స్టాప్ సమీపంలో బొమ్మన వద్ద భారీ వృక్షం నేలకొరవడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ రహదారిపై నేలకొరిగిన భారీ వృక్షాన్ని రోడ్డుపై తొలగించడంలో అనేక సమయం తీసుకోవడం జరిగింది. భారీ వర్షంలో వృక్షాన్ని రోడ్డు నుండి తొలగించారు. అదేవిధంగా జన్నారం పోలీస్ స్టేషన్ పక్కన సుందరయ్య నగర్ రోడ్డు వెంట ఉన్న నీలగిరి చెట్టు కుండపోత వానులకు గాలికి చెట్టు రోడ్డుపైన విరిగి పడింది దానితో మూడు విద్యుత్ స్తంభాలు విరిగిపోయినవి. విద్యుత్ సరఫరా సరఫరా పోయింది. ఈ కాలనీ వాసులు రాత్రి 12 గంటల నుండి కరెంటు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జన్నారం మండలంలో సుందరయ్య కాలనీవాసులు చెట్టుని ముక్కలుగా చేసి రోడ్డు రాకపోకలు వచ్చేటట్లు చేశారు విద్యుత్ అధికారులు సకాలంలో చేరుకొని కొత్త స్తంభాలను నిలిపి కరెంట్ సరఫరా సుందరయ్య కాలనీకి వచ్చేటట్లు చేశారు. కుండపోత వానులకు రైతుల పంటలకు వేసిన నారు నీటి వరదకు కొట్టుకుపోయింది, పత్తి, కంది, మొక్కజొన్న, పంటలోకి నీరు చేరడంతో రైతుల పంట నష్టం వాటిల్లింది. దీంతో రైతులను ప్రభుత్వం ఆదుకొని, నష్టపరిహారం చెల్లించాలని కోరారు. ప్రభుత్వ అధికారులు మరో మూడు రోజులు ఇలాగే వానాలు కులుస్తాయని తెలిపారు. భారీ వర్షాలకు ప్రజలు అప్రమమతంగా ఉంటూ ఇంటి నుండి బయటకు రావాలనుకుంటే అత్యవసర సమయంలో మాత్రమే బయటికి రావాలని అధికారులు తెలిపారు.

You may also like

Leave a Comment