Home తాజా వార్తలు ఈవిఎం (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్) పై అవగాహన….

ఈవిఎం (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్) పై అవగాహన….

by V.Rajendernath

ఎల్లారెడ్డి, జూలై 22,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):

ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని 11 వ వార్డు కింద గల లింగారెడ్డి పెట్ గ్రామంతో పాటు, కల్యాణి, సోమార్ పేట్ గ్రామాల్లో, శనివారం ఈవిఎమ్, వివి ప్యాట్ ల వినియోగంపై ఎల్లారెడ్డి ఎంపిఓ అతి నారపు ప్రకాష్ ఓటర్లకు, అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సంధర్బంగా ఎంపీఓ ఈవిఎం , వివిప్యాట్ ను అనుసందానం చేసి వారికి వివరించారు. ఈవిఎం సహాయంతో ఓటర్లు తాము ఎవరికి ఓటు వేసేది పారదర్శకంగా తెలుస్తుం దన్నారు. యంత్రాల పనితీరుపై అపోహలు ఉండవద్దన్నారు. ఏమైనా సందేహం ఉంటే నివృత్తి చేసుకోవాలన్నారు. ఓటర్లచే మాక్ పోలింగ్ నిర్వహించి ఎంత మంది ఏ గుర్తుకు ఓటు వేశారు, ఎన్ని ఓట్లు పోల్ అయ్యాయి ప్రత్యక్షంగా వారికి చూపించారు. ఈవిఎం, వివి ప్యాట్ల ద్వారా ఓటింగ్ పట్ల ఓటర్లు సంతృప్తి వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో కళ్యాణి సర్పంచ్ శర్వాయిగారి రఘువీర్ గౌడ్, సోమర్ పేట్ సర్పంచ్, కార్యదర్శులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment