Home తాజా వార్తలు ఎల్లారెడ్డి లో కొనసాగుతున్న గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మికుల సమ్మె….

ఎల్లారెడ్డి లో కొనసాగుతున్న గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మికుల సమ్మె….

by V.Rajendernath

ఎల్లారెడ్డి, జూలై 21,( తెలంగాణ ఎక్స్ ప్రెస్) :

గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న సమ్మె, శుక్రవారంతో 16 వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఎల్లారెడ్డి పట్టణంలోని తెలంగాణ తల్లి ప్రాంగణంలో సమ్మెలో పాల్గొన్న ఉద్యోగ కార్మికులు మాట్లాడుతూ, అతి తక్కువ వేతనంతో పనిచేస్తున్న గ్రామపంచాయతీ కార్మికులకు కనీస వేతనం 19,500 రూపాయలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యంతో పాటు ఇన్సూరెన్స్ సౌకర్యం, హెల్త్ కార్డులు ఇవ్వాలని, గ్రామపంచాయతీ కారోబార్లను బిల్ కలెక్టర్ లను పంచాయతీ సహాయ కార్యదర్శులుగా నియమించాలని, గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మిక సంఘ ప్రతినిధులతో ప్రభుత్వం వెంటనే పిలిచి చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండలంలోని గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులు బాలయ్య, ఖాజాపాష , కృష్ణమూర్తి, ప్రకాష్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment