Home తాజా వార్తలు నిజాంసాగర్ ప్రాజెక్టులో పెరుగుతున్న నీటిమట్టం

నిజాంసాగర్ ప్రాజెక్టులో పెరుగుతున్న నీటిమట్టం

by V.Rajendernath

నిజాంసాగర్ జూలై 21( తెలంగాణ ఎక్స్ ప్రెస్):

నిజాంసాగర్ ప్రాజెక్ట్ జలాశంలోనికి వర్షాలు కురవడంతో భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది.ఎడతెరిపి లేకుండా గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు శుక్రవారం 38వేల 700 క్యూసెక్కులు వరద నీరు వచ్చి చేరుతుందని ప్రాజెక్టు ఏఈఈ శివప్రసాద్ తెలిపారు. ప్రాజెక్టు ఎక్కువ ప్రాంతంలోని పోచారం ప్రాజెక్టుతో పాటు పరిసర ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు వరద నీరు వచ్చి చేరడంతో నీటిమట్టం పెరుగుతుంది. భారీ వర్షాలు కురిసి ప్రాజెక్టులోనికి వరద నీరు వచ్చి చేయడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నీటిపారుదల శాఖ అధికారులు అప్రమత్తమై ఎప్పటికప్పుడు నీటి నిలువలను పరిశీలిస్తున్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405.00 అడుగులు కాగా 1395.71 అడుగుల నీరు నిల్వ ఉంది.17.802 టీఎంసీలకు గాను 7.375 టీఎంసీల నీరు నిల్వ ఉందని ఎఈ తెలిపారు.

You may also like

Leave a Comment