Home తాజా వార్తలు తిమ్మారెడ్డి లో ఈవిఎం ఓటింగ్ పై అవగాహన…ఎల్లారెడ్డి ఎంపిఓ అతినారాపు ప్రకాష్

తిమ్మారెడ్డి లో ఈవిఎం ఓటింగ్ పై అవగాహన…ఎల్లారెడ్డి ఎంపిఓ అతినారాపు ప్రకాష్

by V.Rajendernath

ఎల్లారెడ్డి, జులై 21,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):

ఎల్లారెడ్డి మండలంలోని తిమ్మారెడ్డి గ్రామంలో, శుక్రవారం ఎల్లారెడ్డి ఎంపిఓ అతినారపు ప్రకాష్ ఓటర్లకు ఈవిఎం, వివిప్యాట్ గురించి అవహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామ చావిడి వద్ద ఈవిఎం, వివి ప్యాట్ లను ఓటర్లకు ప్రదర్శించారు. ఈవిఎం (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్) కు వివిప్యాట్ (ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్) పేపర్ లెస్ ఎలెక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ను అనుసందానం చేసి ఓటింగ్ వేసే విధానాన్ని ఓటర్లకు వివరించారు. ఈ విధానం ద్వారా ఎన్నికల్లో రిగ్గింగ్ కు అవకాశం ఉండదని తెలిపారు. ఈ అవగాహన కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి విజయ్, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment