Home తాజా వార్తలు బాధిత కుటుంబాలను ఆదుకోవాలి.దోషులను కఠినంగా శిక్షించాలి.మణిపూర్ అల్లర్లు హింసకు కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి.~సిపిఐ (ఎం ఎల్) ప్రజాపంథా డిమాండ్.

బాధిత కుటుంబాలను ఆదుకోవాలి.దోషులను కఠినంగా శిక్షించాలి.మణిపూర్ అల్లర్లు హింసకు కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి.~సిపిఐ (ఎం ఎల్) ప్రజాపంథా డిమాండ్.

by V.Rajendernath


బీబీపేట్. జూలై. 21 🙁 తెలంగాణ ఎక్స్ ప్రెస్ ) మణిపూర్ గిరిజన మహిళలపై అత్యాచారం హత్యలను నిరసిస్తూ, మణిపూర్లో జరుగుతున్న అల్లర్లు, హింసపై కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ సిపిఐ ( ఎం ఎల్ ) ప్రజాపంథా నిజామాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చౌక్ వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది.
ఈ సందర్భంగా సిపిఐ ( ఎం ఎల్ ) ప్రజాపంథా నగర కార్యదర్శి ఎం.సుధాకర్ మాట్లాడుతూ
మణిపూర్ రాష్ట్రంలో కుకీ తెగకు చెందిన ముగ్గురు గిరిజన మహిళలను వివస్త్రను చేసి, అమానుషంగా హింసిస్తూ, నగ్నంగా ఊరేగించి, సామూహిక హత్యాచారం చేసి, ఇద్దరిని హత్య చేసిన ఘటన పట్ల ప్రపంచమే దిగ్బ్రాంతికి గురైందన్నారు. ఈ అమానుష ఘటనలో పాల్గొన్న వారందరిపై హత్య, అత్యాచారం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. బాధిత మహిళల కుటుంబాలకు 50 లక్షల రూపాయలు చొప్పున ఎక్స్ గ్రేషీయా చెల్లించాలని, వంద రోజులుగా జరుగుతున్న అల్లర్లలో ప్రాణాలు, ఆస్తులు కోల్పోయిన బాధిత కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించి, భద్రత కల్పించాలన్నారు.
మణిపూర్లో నిరవధికంగా అల్లర్లు, హింస జరుగుతుంటే, బీజేపీ నాయకత్వంలోని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం సిగ్గుచేటన్నారు.
మణిపూర్ అల్లర్లు, అమానుష ఘటన పట్ల సుప్రీంకోర్టు హెచ్చరిస్తే గానీ, మోడీ ప్రభుత్వానికి చలనం రాలేదన్నారు.
మోడీ, ప్రభుత్వ విద్వేష, మతోన్మాద, విభజన రాజకీయాల ఫలితమే మణిపూర్ అల్లర్లు అని ఆరోపించారు. నరేంద్ర మోడీ, విద్వేష రాజకీయాలను వీడి తక్షణమే మణిపూర్ రాష్ట్రంలో పర్యటించాలని, రాష్ట్రంలో శాంతిభద్రతలు నెలకొల్పాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
కేంద్ర ప్రభుత్వ మనువాద, మతోన్మాద, విద్వేష, విభజన రాజకీయాలను ఎండగట్టాలని ప్రజలు, ప్రజాస్వామ్య వాదులను కోరుతున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో పి ఓ డబ్ల్యు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వి.గోదావరి, కే.సంధ్యారాణి, పి డి ఎస్ యు జిల్లా ప్రధాన కార్యదర్శి కే.గణేష్, ఐ ఎఫ్ టి యు జిల్లా నాయకులు విటల్, కిరణ్, నాయకులు మహిపాల్, లక్ష్మీకాంత్, లలిత, గంగాధర్, సాయి, తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment