Home తాజా వార్తలు పేద విద్యార్థులకు అండగా ఉంటా

పేద విద్యార్థులకు అండగా ఉంటా

by V.Rajendernath

నిర్మల్ జూన్21 జిల్లా ప్రతినిధి:(తెలంగాణ ఎక్స్ ప్రెస్)ఆర్థిక స్థోమత లేని పేద విద్యార్థులందరికీ ఎల్లా వేళలా అండగా ఉంటానని డాక్టర్ కిరణ్ ఫౌండేషన్ చైర్మన్ డా. కిరణ్ కుమార్ తెలిపారు. శుక్రవారం భైంసా పట్టణంలోని వివేకానంద ఆవాసంలో విద్యార్థులకు ఉచితంగా బ్యాగులు పంపిణీ చేశారు. సమాజంలో తన వంతు సహకారం అందించాలనే ఉద్దేశ్యంతో వివిధ సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు ఇప్పటి నుంచే కష్టపడి కాకుండా ఇష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. విద్యను మరింతగా ప్రోత్సహిస్తానని, ఏదైనా ఆర్థిక ఇబ్బందులు ఉండే తొలగించేందుకు కృషి చేస్తానని చెప్పారు. తల్లిదండ్రులు లేరని బాధ పడవద్దని, ఏ ఆపద వచ్చిన తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆవాసం నిర్వాహకులు నారాయణ, లింగారెడ్డి, ఫౌండేషన్ సభ్యులు పెండప్ కాశీనాథ్, మహేష్, రాజు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment