Home తాజా వార్తలు వారధి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో క్యాన్సర్ బిపి షుగర్ డయాబెటిక్ శిబిరం

వారధి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో క్యాన్సర్ బిపి షుగర్ డయాబెటిక్ శిబిరం

by V.Rajendernath

జుక్కల్ జులై 20:-( తెలంగాణ ఎక్స్ ప్రెస్)

కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలో వారధి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కాన్సర్ బీపీ షుగర్ డయాబెటిక్ ఉచిత పరీక్ష శిబిరం కార్యక్రమానికి ముఖ్య అతిధిగా డిస్ట్రిక్ట్ గవర్నర్ లక్ష్మీ మేడం గారు విచ్చేసి వైద్య శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది.గవర్నర్ లక్ష్మీ మేడం ఆధ్వర్యంలో మొక్కలు నాటడం జరిగింది మరియు వృద్దులకు బిస్కట్ల పాకెట్స్ పంపిణీ మరియు షుగర్ బీపీ డయాబెటిక్ కాన్సర్ పరీక్షల కార్యక్రమాలు ప్రారంభించి గవర్నర్ గారు మాట్లాడుతూ మాధవ సేవయే మానవ సేవయే మాధవ సేవ అని ఆరోగ్యమే మహా భాగ్యం అని మారుమూల ప్రాంతంలో సేవ కార్యక్రమాలు చేయడానికి లయన్స్ క్లబ్ ఎప్పుడు ముందు ఉంటుందని ఇక్కడి ప్రజా ప్రతినిధులు ఎంతో సహకరించారని వారధి లయన్స్ క్లబ్ నూతనంగా ఏర్పడిన ఎన్నో మంచి కార్యక్రమాలు నిర్వహిస్తోంది అని కొనియాడారు.వారధి లయన్స్ క్లబ్ అధ్యక్షులు శివ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ఈ అవకాశం మా మండలానికి ఇచ్చినందుకు గవర్నర్ లక్ష్మీ మేడం గారికి GLT కో ఆర్డినటర్ సూర్య నారాయణ గారికి డిస్ట్రిక్ట్ సెక్రటరీ ప్రభు దాస్ గారికి జోనల్ ఛైర్మెన్ ఓం ప్రకాష్ గారికి ధన్యవాదాలు తెలియజేశారు.కార్యక్రమంలో జుక్కల్ ఎంపీపీ నీలు పటేల్ మాజీ AMC చైర్మన్ సాయగౌడ్ జుక్కల్ సర్పంచ్ రాములు సెట్ మాజీ జడ్పీటీసీ పండరీ వ్యక్తిత్వ వికాస నిపుణులు ఉమాకాంత్ గారు మాజీ సొసైటీ ఛైర్మెన్ రాజు పటేల్ మహమ్మదాబాద్ రాజా గౌడ్ కాంబ్లీ విట్ఠల్ వారధి సెక్రటరీ పాకలి శ్రీనివాస్ కోశాధికారి భాను గౌడ్ పురుషోత్తం సెట్ కార్తిక్ గౌడ్ మొగులజీ మంజ్రేకర్ బాలాజీ నాగిరెడ్డి జాధవ్ రాజు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది

You may also like

Leave a Comment