ఎన్నికల కమిషన్ నియామావళి పాటించాలి
తహసిల్దార్ గూడూరి శ్రీనివాస్ రావు
శంకరపట్నం,జూలై 20:-( తెలంగాణ ఎక్స్ ప్రెస్) గ్రామాల్లోని ఓటరు జాబితాలో మార్పులు,చేర్పులు పారదర్శకంగా ఉండాలని శంకరట్నం తాహసీల్దార్ గూడూరి శ్రీనివాస్ రావు అదికారులను, సిబ్బందిని, ఆదేశించారు. మండల కేంద్రంలోని మండల పరిషత్ సమావేశ మందిరంలో మండల పరిధిలోని అన్ని గ్రామాల బిఎల్ఓ లకు ఎన్నికల కమిషన్ ఉత్తర్వుల మేరకు అవగాహన, శిక్షణ తరగతులను నిర్వహించారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తాసిల్దార్ శ్రీనివాస్ రావు మాట్లాడుతూ…ఎన్నికల కమిషన్ ఉత్తర్వుల మేరకు మండల పరిధిలోని అన్ని గ్రామాల్లోని బీఎల్వోలు 18 ఏళ్లు నిండిన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించాలని సూచించారు, గ్రామాల్లో మదిరించిన వారి పేర్లను తొలగించాలన్నారు, రానున్న అసెంబ్లీ ఎన్నికలతో పాటు అన్ని ఎన్నికలకు ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించాలని ఆదేశించారు, మండల పరిధిలో గత నాలుగు రోజుల నుండి విడతది లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ శ్రీకాంత్, శిక్షణ తరగతుల శిక్షకులు, కన్నాపూర్ ప్రధానోపాధ్యాయులు రాపల్లి శ్రీనివాస్, గన్నేరువరం ప్రధానోపాధ్యాయులు చారి, ఆర్ఐ లు లక్ష్మారెడ్డి,అరుణ, వివిధ గ్రామాల బిఎల్వోలు తదితరులు పాల్గొన్నారు,