ఘట్ కేసర్, జులై 20(తెలంగాణ ఎక్స్ ప్రెస్ )
రాష్ట్రం గత ముడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఘట్కేసర్ మున్సిపాలిటీలోని డ్రైనేజీలు అన్ని నిండి పోయినవి, కావున ప్రతి ఒక్కరు విద్యుత్ తీగలకు,దూరంగా వెళ్లాలని,వరద నీరు పోవడానికి మెయిన్ వాల్ తెరిచి ఉన్న వాటిని గమనించాలని, అత్యవసర పరిస్థితిలో మాత్రమే బయటికి రావాలని ఘట్కేసర్ మున్సిపల్ ఛైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ ప్రజానీకాన్ని కోరారు.ముఖ్యంగా చిన్నారుల పట్ల జాగ్రత్త వహిస్తూ వారిని బైటికి పంపడం లాంటివి చేయకూడదని,మరో 2 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిచేసినందున, లోతట్టు ప్రాంతాల వారు అలర్ట్ గా ఉండాలని,విద్యుత్, పిడుగుల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు . వైర్లను తాకవద్దు అని , చెట్ల కింద ఉండవద్దని,పురాతన భవనాల్లో ఉండవద్దని. రోడ్డు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. నెమ్మదిగా వెళ్లాలి. చెరువులు, కాల్వలు దాటవద్దు. తడిసిన స్విచ్ లు వేయవద్దు. ముఖ్యంగా కరెంట్ షాక్, పిడుగులు, ప్రయాణాల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఛైర్పర్సన్ అన్నారు.ఈ సందర్బంగా అత్యవసర పరిస్థితిలో మున్సిపల్ ప్రజలు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ లు తెలియజేశారు.
మున్సిపల్ శానిటేషన్ ఇంచార్జి రాజేష్ :- 9505443353,
ఘట్కేసర్, ధర్మేంధర్:- 9393595938,
బాలాజీ నగర్, రాములు 9553480826,
కొండాపూర్, బర్ల కృష్ణ :- 7729005033,
NFC నగర్,యాదయ్య:- 8019660211. అత్యవసర పరిస్థితిలో వీరికి కాల్ చేయాలని తెలిపారు…
అత్యవసర పరిస్థితిలో మాత్రమే బయటికి రావాలి…ఛైర్పర్సన్ పావని జంగయ్య యాదవ్ .
32
previous post