మంచిర్యాల, జులై 19, (తెలంగాణ ఎక్స్ ప్రెస్): మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో ఎటువంటి గుర్తింపు లేకుండా విలేకరులమంటూ, బెదిరింపులకు పాల్పడుతూ అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్న సామాజిక మాధ్యమాల్లో నిరాదారిత మెసేజ్ లు పెడుతూ జన్నారం మండలం యందు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ సృష్టిస్తున్నటువంటి వ్యక్తులపై ప్రత్యేక బృందంచే నిఘ పెట్టి అటువంటి మెసేజ్లు పెడుతున్న ఒక వ్యక్తిని బుధవారం జన్నారం పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ చేయడం జరిగినది. ఈ సందర్భంగా జన్నారం మండలంలో ప్రజలను బెదిరించడం, వెదిరింపులకు పాల్పడిన వ్యక్తులపై, మండల ప్రజలకు ఎటువంటి నిరాదారితమైన మెసేజ్లను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన ఎడల, అట్టి వ్యక్తులపై ధైర్యంగా స్థానిక పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు ఇచ్చిన ఎడల వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రత్యేక నిఘా పోలీసులు బృందం, జన్నారం పోలీసులు, తదితరులు పాల్గొన్నారు.
విలేకరులు అంటూ వేధింపులకు పాల్పడుతున్న వ్యక్తులపై ప్రత్యేక బృందంచే నిఘా పెట్టిన జన్నారం పోలీసులు
39
previous post