జగదేవపూర్ సబ్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి.
జగదేవపూర్ : 19 జూలై (తెలంగాణ ఎక్స్ప్రెస్)
జగదేవపూర్: వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జగదేవపూర్ స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి అన్నారు.
బుధవారం స్థానిక విలేఖర్లతో ఆయన మాట్లాడుతూ గత రెండు రోజులుగా
మండల వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు.
మరో రెండు రోజులు వర్సాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
శిథిలావస్థలో ఉన్న పురాతన కట్టడాలు ఇళ్లలోని ప్రజలు గ్రామ అధికారుల సయంతో సురక్షిత ప్రాంతానికి వెళ్లాలని కోరారు.వర్షానికి చిన్న చిన్న నదులు. కుంటలు.చెరువుల్లో భారీగా నీరు చేరుతుండటంతో పెద్దలు తమ పిల్లలను అటువైపుగా వెళ్ళనివ్వకుండా చూడాలని అన్నారు. పాత మిద్దెలు.గోడల పక్కన ఎవరు నిల్చోకూడదని తెలిపారు.తడిసిన స్తంబాలను,విద్యుత్ మీటర్లను ముట్టుకోవద్దని ,స్విచ్ బోర్డులను తకావద్దని పొడిగా ఉన్న చిన్న కర్రతో లేదా ప్లాస్టిక్ వస్తువుతో స్విచ్చులు వేయాలని సూచించారు. గ్రామాల్లో చిన్న పిల్లలను కరెంటు సరఫరా అయ్యే వస్తువుల వద్దకు పోనివ్వకుండా చూసుకోవాలన్నారు. వర్ష వల్ల ఎవరైనా ఇబ్బంది ఉంటే ఏదైనా అనుకోని ప్రమాదం సంఘటన జరిగితే వెంటనే 100 కు లేదా 87126 67339 కు కాల్ చేసి సమాచారం అందించాలని సబ్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి తెలిపారు.