Home తాజా వార్తలు -న్యాయమైన డిమాండ్లను తక్షణమే నెరవేర్చాలి

-న్యాయమైన డిమాండ్లను తక్షణమే నెరవేర్చాలి

by V.Rajendernath

-సమ్మె బాట పట్టిన గ్రామపంచాయతీ కార్మికులు

  • రాష్ట్రం ప్రకటించిన పి.ఆర్.సి.ని అమలు చేయాలి,,
  • ఐ ఎఫ్ టి యు జిల్లా ఉపాధ్యక్షులు ఏజి భుట్టో,,

మక్తల్. జులై. 06:- (తెలంగాణ ఎక్స్ ప్రెస్) నియోజకవర్గం పరిధి కృష్ణ మండల కేంద్రంలో గ్రామపంచాయతీ కార్మికుల మొదటి రోజు సమ్మె ప్రారంభమైంది. ఎంపీడీవో ఆఫీస్ ముందు నిరసతెలిపారు. సమ్మెను ఉద్దేశించి ఐ.ఎఫ్టి.యు జిల్లా ఉపాధ్యక్షులు ఏజీ భుట్టో సమ్మె శిబిరాన్ని ప్రారంభిస్తూ ప్రసంగించడం జరిగింది,రాష్ట్రవ్యాప్తంగా గ్రామపంచాయతీ కార్మికులు చాలీచాలని వేతనాలతో జీవిస్తా ఉన్నారు 13, డిమాండ్లతో ఈ సమ్మెను చేపడతావున్నారు, గ్రామపంచాయతీ కార్మికులకు పర్మినెంట్ చేయాలని,రాష్ట్ర ప్రకటించిన పి.ఆర్సి.ని అమలు చేయాలని, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని,నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని,అట్లాగే ప్రతి వర్కర్స్ కు ఇన్సూరెన్స్ ఐదు లక్షలు ఇవ్వాలని ప్రమాద బీమా 10 లక్షలు ఇవ్వాలని దహన సంస్కారాలకు, 30,వెలు ఇవ్వాలని ప్రతి సంవత్సరము మూడు జతల బట్టలు,చెప్పులు, సబ్బులు, ఇవ్వాలని పి.ఎఫ్, ఈ.ఎస్.ఐ, అమలు చేయాలని న్యాయమైన డిమాండ్లతో చేపడుతున్న సమ్మెను ప్రజలు భాగస్వాములై కార్మికులు చేస్తున్న సమ్మెనుభలపర్చలని ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని లేనియెడల సమ్మెను ఉధృతం చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ వర్కర్స్,యూనియన్, మండల అధ్యక్షులు తాయప్పా,కార్యదర్శి నరేష్,హుసేనప్ప,ఏళ్ళప్ప,వెంకటేష్, శ్రీను,వెంకటేష్ మల్లికార్జున్, శరణప్ప సురేందర్,తిమ్మక్క, మాదేవమ్మ, సాబామ్మ, హుస్సేనమ్మ, పద్మమ్మ,తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment