సైదాపూర్, జూలై 6 .
(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
మండల కేంద్రములోని ప్రభుత్వ మోడల్ స్కూల్లో ఉన్నత పాఠశాలకు చెందిన సర్వాయిపేట గ్రామపంచాయతీ పరిధిలోని శివరంపల్లి గ్రామానికి చెందిన గొట్టే కవిత కైలాసముల కుమార్తె శృతి ప్రభుత్వ మోడల్ స్కూల్లో గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థిని, ట్రిపుల్ ఐటీ కి ఎంపికయింది ఇటీవలే ట్రిపుల్ ఐటీకు ఎంపికైన విద్యార్థులు జాబితాను విడుదల చేశారు. విద్యార్థులు, విద్యార్థిని ట్రీపుల్ ఐటీ కి ఎంపీక కావడం పట్ల మోడల్ స్కూల్ పాఠశాల ప్రిన్సిపల్ పరహాన అభినందించారు. విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. అదేవిధంగా ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు ట్రిపుల్ ఐటికి విద్యార్థులు ఎంపిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు మా గ్రామానికి చెందిన విద్యార్థిని శృతికి అభినందనలు తెలుపుతూ గ్రామ సర్పంచ్ ఏనుగుల ఐలయ్య బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పొలు ప్రవీణ్ పాటు విద్యార్థిని తల్లిదండ్రులైన కవిత కైలాసం సంతోషం వ్యక్తం చేశారు విద్యార్థినికి ట్రిపుల్ ఐటీ కి ఎంపిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.