చేగుంట జూలై 5:–(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
మెదక్ జిల్లా చెగుంట మండలం లోని ఇబ్రహీంపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం బ్యాంకు ద్వారా నిర్మించిన పెట్రోల్ బంకు కరోనా నుండి దేశం మొత్తంలో సహకార సంఘం ద్వారా నిర్మించిన బంకులకు ప్రభుత్వం నుంచి అందించే రుణాన్ని పొంది ఈరోజు బోనాల గ్రామంలో నిర్మించిన కన్జ్మర్ పెట్రోల్ బంకు ఈరోజు ప్రారంభించడం జరిగింది ఇబ్రహీంపూర్ పులిమామిడి కిస్టాపూర్ బోనాల కొండాపూర్ బోనాల గ్రామాల రైతులకు ఎంతగానో ఉపయోగపడుతూ రైతులకు అందుబాటులో ఉండి రైతులకు ఉపయోగపడుతుందని ఇబ్రహీంపూర్ సహకార సంఘం చైర్మన్ కొండల్ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ బోనాల చుట్టుపక్కల ఐదు గ్రామాల ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతూ సాధారణ పెట్రోల్ పంపు కంటే సహకార సంఘం ద్వారా నిర్మించిన పెట్రోల్ బంకులు రెండు రూపాయల తగ్గింపుతో పెట్రోల్ డీజిల్ అందిస్తున్నామని తెలిపారు ఈ అవకాశాన్ని రైతులు ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు