చేగుంట జూలై 5:–(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
మెదక్ జిల్లా చేగుంట మండలం కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షులుగా వడ్ల నవీన్ ను నియమించారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి కృపతో చేగుంట మండల అధ్యక్షులుగా నియమించడం ఎంతో సంతోషమని వడ్ల నవీన్ తెలిపారు అదేవిధంగా పార్టీ బలోపేతానికి తన వంతు సహకారం మరియు ప్రతి ఒక్క కార్యకర్తను కలుపుగోలుగా కలుపుకొని పార్టీ ఆదేశాల మేరకు పని చేస్తానని తెలిపారు మండల అధ్యక్ష పదవి ఇచ్చినందుకుగాను మహేష్ గౌడ్ గారికి మరియు దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపారు