- వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయ అధ్యక్షుడు వీరబొమ్మ రామ్మోహన్
కల్వకుర్తి నియోజకవర్గం ప్రతినిధి(ఆమనగల్లు) జులై 05 (తెలంగాణ ఎక్స్ ప్రెస్):
రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండల కేంద్రంలోని వాసవి మాతా కన్యకా పరమేశ్వరీ దేవాలయంలో ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో 07-07-2023 శుక్రవారం రోజు ఉదయం 7.30 గంటలకు అభిషేకం, 8.00 గంటలకు గో పూజ కార్యక్రమాలు, 9.00గంటలకు ప్రత్యేక పూజలు, గోత్రనామాలు పూజలు, 12.30కి తీర్థ ప్రసాదాలు, లలితా సహస్ర నామ హోమం నిర్వహించబడును కావున ఆర్య వైశ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయ అధ్యక్షుడు వీరబోమ్మ రాంమోహన్, ప్రధాన కార్యదర్శి బిక్కుమాండ్ల నర్సింహ, కోశాధికారి డాక్టర్ బిక్కుమాండ్ల శ్రీనివాస్ తెలిపారు.