Home తాజా వార్తలు ఈ నెల 9 న ఛలో హైదరాబాద్ ‘బ్రహ్మ గర్జన’ విజయవంతం చేయాలి…కామారెడ్డి జిల్లా బ్రహ్మ గర్జన కన్వీనర్ పాల్యోజుల శ్రీనివాస్ శర్మ

ఈ నెల 9 న ఛలో హైదరాబాద్ ‘బ్రహ్మ గర్జన’ విజయవంతం చేయాలి…కామారెడ్డి జిల్లా బ్రహ్మ గర్జన కన్వీనర్ పాల్యోజుల శ్రీనివాస్ శర్మ

by V.Rajendernath

ఎల్లారెడ్డి, జులై 5,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):

రాష్ట్ర రాజధాని హైదరాబాదు లో ఈ నెల 9 న ఆదివారం సరూర్ నగర్ స్టేడియం గ్రౌండ్స్ లో నిర్వహించనున్న బ్రహ్మ గర్జన భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని, కామారెడ్డి జిల్లా బ్రహ్మ గర్జన కన్వీనర్ పాల్యోజుల శ్రీనివాస్ శర్మ అన్నారు. బుదవారం స్థానిక బిందర్ లోని రుక్మిణీ పాండురంగని ఆలయంలో ఎల్లారెడ్డి బ్రహ్మణ సంఘం అధ్యక్షులు శ్రీధర్ జ్యోషి, పట్టణ బ్రాహ్మణులతో కలిసి బ్రహ్మ గర్జన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ శర్మ మాట్లాడుతూ, బ్రాహ్మణుల హక్కుల కోసం, ఆత్మ గౌరవం కోసం జరిగే పోరాటానికికై, బ్రాహ్మణుల అస్తిత్వాన్ని కాపాడుకు నేందుకు, బ్రాహ్మణ కుల ధర్మ పరిరక్షణకు న్యాయ పరమైన కోర్కెల సాధనకు రాజకీయ పురోగమనానికి తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ప్రతిపాదించిన భారీ బహిరంగ సభ బ్రహ్మ గర్జన అని అన్నారు. శాఖ ప్రాంత భేదం లేకుండా అన్ని సంఘాల బ్రాహ్మణ బందు మిత్రులందరిని కలుపుకుని బ్రహ్మ గర్జన మహా యజ్ఞాన్ని విజయవంతం చేయాలని సంకల్పించామన్నారు. అర్చక పౌర హిత్యాన్ని బ్రాహ్మణ కుల వృత్తిగా సాధించుకునేందుకే బ్రహ్మ గర్జన అని తెలిపారు. ఈ కార్యక్రమానికి బ్రాహ్మణ బందు మిత్రులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం బ్రహ్మ గర్జన కార్యక్రమానికి శ్రీధర్ జ్యోషీ, కొండంబొట్ల రాజేశ్వర్ రావు ను కో కన్వీనర్లు గా నియమించారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణ్ రావు, కొండంబొట్ల కృష్ణ మూర్తి, పటేల్ నర్సింహ రావు, నారాయణ రావు , కొండంబొట్ల రాజేశ్వర్ రావు శర్మ, రమేష్ పురోహిత్, ప్రణయ్ జోషి , ప్రవీణ్ జోషి, సిద్దు పంతులు, పవన్ పంతులు, సురేందర్ రావు తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment