Home తాజా వార్తలు వీధి విక్రయదారులు బ్యాంకు రుణాలు సద్వినియోగం చేసుకోవాలి….ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ

వీధి విక్రయదారులు బ్యాంకు రుణాలు సద్వినియోగం చేసుకోవాలి….ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ

by V.Rajendernath

ఎల్లారెడ్డి, జులై 5,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):

ఎల్లారెడ్డి పట్టణ వీధి విక్రయదారులు బ్యాంకుల ద్వారా పొందిన రుణాలను సద్వినియోగం చేసుకోవాలని, ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ అన్నారు. బుధవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ అధ్యక్షతన బ్యాంకు అధికారులు పట్టణ విక్రయదారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ బ్యాంకు ద్వారా తీసుకున్న రుణాలను సద్వినియోగం చేసుకుని, ఆర్థికంగా అభివృద్ధి చెంది వాయిదాల ప్రకారం సకాలంలో చెల్లించి, తిరిగి రుణం పొందేలా అర్హత సాధించాలని సూచించారు. ఆ తర్వాత స్థానిక ఎస్బిఐ ఫీల్డ్ ఆఫీసర్ మల్లేశం మాట్లాడుతూ, వీధి విక్రయ దారులు బ్యాంకు ద్వారా తీసుకున్న 20 వేల రూపాయల రుణాన్ని 3 నెలల పాటు క్రమం తప్పకుండా వాయిదాల ప్రకారం చెల్లించిన వారు, 50 వేల రూపాయల రుణాలు పొందేందుకు అర్హత సాధిస్తారని తెలిపారు. తీసుకున్న రుణాలను వ్యాపారంలో పెట్టుబడి పెట్టి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, రుణాన్ని వాయిదాల ప్రకారం పూర్తిగా చెల్లించాలని సూచించారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్, ఎస్బిఐ ఫీల్డ్ ఆఫీసర్, ఎల్లారెడ్డి యూనియన్ బ్యాంక్ మేనేజర్ పవన్, డెక్కన్ గ్రామీణ బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్ క్రాంతి, మున్సిపల్ మెప్మా మహిళా అర్పిలు అమృత, రేఖ, సోనీ, పార్వతి, సవిత, హసీనా, అంజయ్య, కిరణ్, మహిళా సమాఖ్య అధ్యక్షు రాలు స్వర్ణలత, పట్టణ వీధి విక్రయదారులు తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment