Home తాజా వార్తలు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి మల్లారెడ్డి…

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి మల్లారెడ్డి…

by V.Rajendernath

ఘట్కేసర్ జులై 05(తెలంగాణ ఎక్స్ ప్రెస్ )మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మున్సిపాలిటీ 1వ వార్డ్ లో 22 లక్షల నిధులతో పలు అభివృద్ధి పనులకు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మఖ్య అతిధిగా తెలంగాణ రాష్ట్ర కార్మిక మంత్రి చామకూర మల్లారెడ్డి,పాల్గొని స్థానిక కౌన్సిలర్ చందుపట్ల వెంకటరెడ్డితో కలిసి, కొబ్బరికాయ కొట్టి పనులని ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ఎమ్మెల్యే నిధులనుండి కోటి డెబ్బయ్ లక్షలు వెచ్చించి మున్సిపల్లోని అన్ని వార్డుల్లో అభివృద్ధి పనులు ప్రారంభిచుకుంటున్నాము అన్నారు. వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, మంత్రి మల్లారెడ్డి ఎన్నో అభివృద్ధి పనులు చేయడం పట్ల వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అన్నారు.మా కాలనీలోని సీనియర్ సిటిజెన్స్ కోసం ఒక్క గ్రంధాలయం కావాలని అడుగగా మంత్రి సానుకూలంగా స్పందించారని అన్నారు.మంత్రి దొరకడం మా మున్సిపాలిటీ ప్రజలము అదృష్టంగా భావిస్తున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో ఛైర్పర్సన్ ముల్లి పావనిజంగయ్య యాదవ్, కమిషనర్ వేమన రెడ్డి, వైస్ చైర్మన్ పలుగుల మాధవరెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు కొంతం అంజి రెడ్డి, బీఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు బండారు శ్రీనివాస్ గౌడ్ ,కౌన్సిలర్లు రమాదేవి, బండారు అంజి గౌడ్, సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సోమయ్య, శేఖర్, బాబురావు, అశ్విని, యాదిరెడ్డి, సురేష్ రావ్, మల్లికార్జున రావ్, సూర్యకాంత్, క్రిష్ణ, అంబుజం కాలిని మహిళలు,బీ ఆర్ ఎస్ నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు…

You may also like

Leave a Comment