ముధోల్ :జులై05 (తెలంగాణ ఎక్స్ ప్రెస్ ). ముధోల్ మండలంలోని విట్టోలి గ్రామంలో స్వయం సహయక మహిళా సంఘాల సభ్యులకు బుధవారం ఆజాదిక అమృత్ మహోత్సవంలో భాగంగా ఆర్థిక అక్షరాస్యత-డిజిటల్ లావాదేవీలపై ముధోల్ ఎస్బిఐ ఫీల్డ్ ఆఫీసర్ శ్రీనివాస్ శ్రీవాత్సవ అవగాహన కల్పించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మహిళలు డిజిటల్ లావాదేవీల పై దృష్టి సారించాలని సూచించారు. డిజిటల్ లావాదేవీలు ఎంతో సురక్షితమైనవని తెలిపారు. అదేవిధంగా ఆర్థిక అక్షరాస్యత అభివృద్ధికి బాటలు వేస్తుందని వెల్లడించారు. ప్రతి ఒక్కరు ఇన్సూరెన్స్ ను చేసుకోవాలని పేర్కొన్నారు ఆర్థికంగా ఉన్నతికి పొదుపు ఎంతో ముఖ్యమని తెలిపారు. మహిళా సంఘాల సభ్యులు ప్రతి ఒక్కరు ఇన్సూరెన్స్ చేసుకునే విధంగా ప్రోత్సహించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం గురుచరణ్, సర్పంచ్ సత్తయ్య గౌడ్, సిసి వందేమాతరం, వివోఏ దేవేందర్, వీడిసి అధ్యక్షుడు తులసిరామ్, పంచాయతీ కార్యదర్శి సంతోష్, మహిళా సంఘాల సభ్యులు, తదితరులు, పాల్గొన్నారు.
డిజిటల్ లావాదేవీల పై అవగాహన
33