15
కుల్కచర్ల, జూలై 5, ( తెలంగాణ ఎక్స్ ప్రెస్):
కుల్కచర్ల, చౌడాపూర్ జంట మండలాలకు కొత్తగా నియమించబడినటువంటి ఎస్సై శ్రీశైలం ను చౌడపూర్ మండలాల బిఆర్ఎస్ పార్టీ నాయకులు తెలంగాణ పంచాయతీ రాజ్ ఛాంబర్ రాష్ట్ర కార్యదర్శి మందిపాల్ వెంకట్, మండల కో ఆప్షన్ మెంబర్ జుబేర్, ఘనపూర్ వెంకట్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…శాంతి భద్రతల దృష్ట్యా ప్రజలతో మమేకమై ఉంటూ జంట మండలాలలో ఎలాంటి విఘాతాలు జరగకుండా చూసుకుంటామని అన్నారు. ఈ సందర్భంగా ఎస్సై శ్రీశైలం ను సన్మానించారు.