కుల్కచర్ల, జూలై 5, ( తెలంగాణ ఎక్స్ ప్రెస్): గ్రామాల అభివృద్ధి కోసం ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి కుల్కచర్ల మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో కుల్కచర్ల ఎంపీపీ సత్య హరిచంద్ర అధ్యక్షతన నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న డిసిసిబి చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ అధికారులు, ప్రజాప్రతినిధులు సమిష్టిగా పనిచేస్తూ గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. గ్రామాలను ఆదర్శంగా తీర్చి దిద్దాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ రాందాస్ నాయక్, మండల రైతు బంధు సమితి అధ్యక్షుడు రాజు, ఎంపీడీఓ నాగవేణి, వైస్ ఎంపీపీ రాజశేఖర్ గౌడ్, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో కుల్కచర్ల మండల ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, వివిధ గ్రామాల సర్పంచ్ లు, ఎంపిటిసి లు పాల్గొన్నారు..