ముధోల్ :జులై05 (తెలంగాణ ఎక్స్ ప్రెస్ ). మండల కేంద్రమైన ముధోల్ ఎంపీడీవో కార్యాలయ సమీపంలో పాత ఐకెపి భవనంలో నిరుద్యోగ యువత కొరకు ఏర్పాటు చేసిన రీడింగ్ రూమ్ ను బుధవారం నిర్మల్ జిల్లా కలెక్టర్ వరుణ్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రీడింగ్ రూమ్ ను క్షుణ్ణంగా పరిశీలించి పలు వివరాలను ఎంపీడీవో సురేష్ బాబును అడిగి తెలుసుకున్నారు. రీడింగ్ రూమ్ లో మరిన్ని పెయింటింగ్లు వేయాలని ఆదేశించారు. రీడింగ్ రూమ్ కు అవసరమైన ఫర్నిచర్ ను త్వరలోనే అందిస్తామని తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు నిర్దేశించిన గడువులోగా రీడింగ్ రూమ్ ను పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సురేష్ బాబు, ఎంఈఓ మైసాజీ, ఏపీఓ శిరీష, అధికారులు, సిబ్బంది, తదితరులు, ఉన్నారు.
రీడింగ్ రూమ్ పరిశీలించిన కలెక్టర్
30
previous post