Home Epaper చదువులెలా సాగుతాయి

చదువులెలా సాగుతాయి

by V.Rajendernath

  • తరగతులు ఏడు
  • ఉపాద్యాయులు ఇద్దరు
  • విద్యార్థులు 130
    జడ్పిటిసి స్వగ్రామంలో ఈ దుస్థితి

దౌల్తాబాద్ (జూన్ 29) తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌:

మండల పరిధిలోని సుల్తాన్ పూర్ గ్రామంలో పిల్లలకు చదువులు దూరమౌతున్నాయి. ప్రభుత్వ పాఠశాల ఉన్న వారికి విద్య అందని ద్రాక్ష గా మిగిలింది. గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల లో ఏడో తరగతి వరకు ఉంటుంది. విద్యార్థులు కూడా అందుకు తగ్గట్టుగానే సుమారు 130 మంది ఉన్నారు. కాని ఇంతమంది విద్యార్థులకు ఉపాద్యాయులు మాత్రం ఇద్దరే ఉన్నారు. ఇద్దరే ఉపాద్యాయులు ఉండడం తో చదువులెలా సాగుతాయని ప్రశ్నిస్తున్నారు.గత వారం కిందట బడిబాట కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు అందరు ప్రభుత్వ బడిలో‌ చదవాలన్నారు. కాని తరగతులకు తగ్గ ఉపాద్యాయులు లేకపోవడం తో విద్యార్థులకు చదువులెలా చెప్తారన్నా ఆందోళన తల్లిదండ్రుల లో నెలకొంది. ఇద్దరే ఉపాద్యాయులు ఉండడం ఎవరైనా ఒకరు పాఠశాల పనిమీద ఎక్కడికైనా వెళ్తే అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించవచ్చు. మరో విషయం ఏంటంటే జడ్పిటిసి మహిపాల్ స్వగ్రామం కావడంతో అతనైనా స్పందించి సమస్యను పరిష్కారించాలని కోరుతున్నారు.

You may also like

Leave a Comment