పటాన్చెరు జూన్ 27 (తెలంగాణ ఎక్స్ ప్రెస్ ప్రతినిధి)-;తెల్లాపూర్ మున్సిపాలిటీ ఈదులనాగులపల్లిలో ఎన్‌ఎంఆర్ యువసేన కార్యాలయాన్ని నీలం మధు ముదిరాజ్ ప్రారంభించారు. అనంతరం శంకర్‌చారి ఆధ్వర్యంలో యువకులు ఎన్‌ఎంఆర్ యువసేనలో చేరడంతో వారికి శాలువ వేసీ యువసేనలోకి ఆయన ఆహ్వానించారు. ప్రజల సమస్యలపై ఎల్లప్పుడూ ఈ ఎన్‌ఎంఆర్ యువసేన స్పందిస్తూ వారి అవసరాలకు అసరాగా ఉంటూ సమస్యలు తీర్చడంలో నిమగ్నం అవుతున్నారని ఇది ఎంతో ఆనందంగా ఉందని ఆయన తెలిపారు. దీనితోపాటు ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై విస్తృత ప్రచారానికి కూడా శ్రీకారం చుట్టనున్నట్లు ఆయన తెలిపారు. ప్రజలకు ఉపయోపడే విధంగా ఉండటమే ఎన్‌ఎంఆర్ అంతిమ లక్ష్యమని ఆయన తెలిపారు. నియోజకవర్గ ప్రజలు తనపై నమ్మకం ఉంచి నావెంటే ఉంటే మంత్రులు కేటీఆర్, హరీష్‌రావుల ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున మహిళలు మాజీ సర్పంచ్ లింగం,మధు పంతులు,నారాయణ చారి,శంకర్ చారి,సుదర్శన్, అమార్,అశోక్,లక్ష్మణ్,సురేష్,మల్లేష్,యాదయ్య,మధుసూదన్, రవి చారి,పాండువీరేష్,లక్ష్మణ్,భాస్కర్,కృష్ణ,ఆంజనేయులు,సతీష్,చాకలి రాజు,శ్రీశైలం, గ్రామ ప్రజలు, ఎన్ ఎం ఆర్ యువసేన సభ్యులు, తదితరులు, పాల్గొన్నారు.
24
previous post