43
- సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఎ. మల్లేశం , కడారి నాగరాజు.
నర్సాపూర్, ఏప్రిల్ 24:(తెలంగాణ ఎక్స్ ప్రెస్) ప్రపంచ కార్మిక దినోత్సవని ప్రపంచ దేశాల్లోని కార్మిక వర్గం ఉత్సహంగా నిర్వహించుకునే కార్మిక పండగ మే డే అని సీఐటీయూ మెదక్ జిల్లా ఉపాధ్యక్షులు ఎ. మల్లేశం , కడారి నాగరాజు అన్నారు . సోమవారం సీఐటీయూ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
అమెరికాలోని చికాగో నగరంలో మొదటగా ఎర్రజెండా రక్తపు గుర్తుతోని కార్మికవర్గం ఎగరవేసిందని అప్పటి నుండి కార్మికుడికి పనిగంటలు తాగి కార్మిక చట్టాల ఏర్పడినయని గుర్తుచేశారు . అనేక పోరాటాలు , ప్రాణ త్యాగాల ద్వారా సాధించున్న కార్మిక హక్కులు నేడు మోడీ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కార్పొరేట్ , పెట్టుబడి దారులకు ఊడిగం చేస్తూ కార్మికుల నడివిరుస్తుందన్నారు . పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసి లేబర్ కోర్డ్ తోసుకోచిందని మండిపడ్డారు . భారత దేశంలో మోడీ ఇలాగే పరిపాలిస్తే వచ్చే ఎన్నికలలో కార్మికులు కచ్చితంగా బుద్ధిచెప్తారని అన్నారు . ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా మే డే ఉత్సవాలు వారంరోజులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మే డే రోజు అన్ని ప్రాంతాలలో జెండా ఆవిష్కరణలు , రోజు ఏదో ఒక కార్యక్రమం ఆట , పాట , మాట , రాత , గీత లాగా ఉంటాయని ఈ కార్యక్రమాలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు . ఈ కార్యక్రమంలో మహేష్ , చంద్రయ్య , శంకరయ్య , శ్రీశైలం , అనిత , దాసు తదితరులు పాల్గొన్నారు .