నర్సాపూర్ , ఏప్రిల్ 14:(తెలంగాణ ఎక్స్ ప్రెస్) నామ మాత్రం వేతనంతో జీవితాంతం పాఠశాలలో PTA పార్ట్ టైం అటెండర్ గా పనిచేసే MPPS NO-1నందు రిటైర్మెంట్ అయి మండల వనరుల కేంద్రం నర్సాపూర్ లో ఎంతోమంది ఉపాధ్యాయులకు సేవలు అందించిన కిష్టయ్య అనారోగ్యంతో పక్షవాతంతో నారాయణ హృదయాలయ హాస్పిటల్ నందు చికిత్స పొంది ఇంటికి వచ్చిన విషయం తెలుసుకొని పి ఆర్ టి యు నాయకులు పరామర్శించి ఉడుతా భక్తిగా 10000 ( పదివేల రూపాయలు ) ఆర్థిక సాయం మరియు పండ్లు అందించడం జరిగింది. అదేవిధంగా కేజీబీవీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి సరూపారాణి 1000 ( వెయ్యి రూపాయలు) ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు లక్ష్మీనారాయణ , చందర్ ,రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు సామ్య నాయక్ ,జిల్లా బాధ్యులు లాలు, చెన్నా, ఇంతియాజ్, సత్యనారాయణ, జేత్య, భీమ్లా, బ్రహ్మచారి, వెంకటస్వామి మరియు ప్రసన్న కుమార్, రమేష్ శివంపేట్ మండల గౌరవ అధ్యక్షులు రవీందర్ పాల్గొన్నారు.
కిష్టయ్యకు ఆర్థిక సహాయం…..
31
previous post