నాగిరెడ్డిపేట ,ఏప్రిల్ 13:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
నాగిరెడ్డిపేట మండలంలోని చినూర్ గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమంను ఎంపీపీ దివిటి రాజదాసు గురువారం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ కంటి వెలుగు కార్యక్రమంను ప్రతి ఒక్కరూ వినియోగించుకొని కావలసిన మందులను,కంటి అద్దాలను తీసుకోవాలన్నారు.రాష్ట్ర ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమం రాష్ట్రమంతటా ఎంతో బాగా చేపడుతుందని,ఎవరు నిర్లక్ష్యం చేయకుండా,కంటి సమస్యలను వివరించి లబ్ధిపొందాలన్నారు.రాష్ట్ర మంత్రుల కంటి వెలుగు కొనసాగుతుండడంతో మంచి స్పందన వస్తుందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గండి ఆంజనేయులు,ఎంపిటిసి గుర్రాల సుశీల సిద్దయ్య,ఎంపీడీవో రఘు,గ్రామ కార్యదర్శి సరేందర్,గ్రామ పెద్దలు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
చినూర్ గ్రామంలో కంటి వెలుగు వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎంపీపీ
34