ఎల్లారెడ్డి, ఏప్రిల్ 13,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):
ఎల్లారెడ్డి నియోజకవర్గానికి తెలంగాణ రాష్ట్ర సర్కార్ బీద ముస్లిం సోదరుల కోసం 1500 గిఫ్ట్ ప్యాక్ లు పంపిణీ చేసిందని, స్థానిక ఆర్డీవో ఎస్.శ్రీను తెలిపారు. గురువారం ఆర్డీవో కార్యాలయం స్థానిక తహశీల్దార్ జి.సుధాకర్ తో కలిసి ముస్లీం మత పెద్దలలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ, నియోజక వర్గంలోని 8 మండలాల లోని బీద ముస్లీం సోదరుల కోసం రంజాన్ తొఫా లు వచ్చాయని, గాంధారి మండలానికి 200, తాడ్వాయి కి 100, లింగంపేట్ కు 250, నాగిరెడ్డిపేట్ కు 175, సదాశివనగర్ కు 75, రామారెడ్డి కి 75, ఎల్లారెడ్డి మండలానికి 600, రాజంపేట్ కు 25 కలిపి మొత్తం 1500 గిఫ్ట్ ప్యాక్ లు వచ్చాయని తెలిపారు. నియోజవర్గంలోని ఎల్లారెడ్డి, లింగంపేట్, గాంధారి మండలాలకు ఒక్కో లక్ష రూపాయల చొప్పున ముస్లిం సోదరుల కు రాష్ట్ర సిఎం కేసీఆర్ సర్కార్ తరఫున అధికారిక విందు కోసం 3 లక్షల రూపాయలు కేటాయించిందని తెలిపారు. ఎల్లారెడ్డి మండల కేంద్రంలో అధికారిక విందు తేదీని, స్థానిక ఎమ్మెల్యే జాజాల సురేందర్ తో చర్చించి ప్రకటించడం జరుగుతోందని ఆర్డీవో తెలిపారు. గిఫ్ట్ ప్యాక్ ల పంపిణీ కోసం మండలంలోని అర్హులైన నిరుపేద ముస్లిం సోదరుల జాబితాను సిద్ధం చేసి పంపిణీ చేయాలని సూచించారు. ఈ సమావేశంలో స్థానిక ముస్లీంల సదర్, మాజీ జడ్పీటిసి షేక్ గయజుద్దిన్, మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు ముజ్జూ, బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఇమ్రాన్ సాజిద్, బర్కత్, సాజిద్, హనీఫ్, గౌస్ అలీ ఖామోషి, యూసుఫ్, మోహినుద్దిన్, తహసిల్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.