శాలువాతో సత్కరించిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
రాజాపూర్ ఏప్రిల్ 12:- (తెలంగాణ ఎక్స్ ప్రెస్)
రాజాపూర్ మండల పరిధిలోని ఇబ్రహీం పల్లి గ్రామ యూత్ వింగ్ అధ్యక్షులు మల్లెపాక యాదయ్య జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి.
బుధవారం రాజాపూర్ మండల పరిధిలోని రైతు వేదిక లో ఇబ్రహీం పల్లి యూత్ వింగ్ గ్రామ అధ్యక్షులు మల్లెపాక యాదయ్య జన్మదిన వేడుకల్లో పాల్గొన్న
ఎమ్మెల్యే డాక్టర్ సి. లక్ష్మారెడ్డి, డీసీఎంహెచ్ చైర్మన్ పట్ల ప్రభాకర్ రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ కొడంగల్ యాదయ్య, ఎంపీపీ సుశీల రమేష్ నాయక్, జడ్పిటిసి మోహన్ నాయక్, వైస్ ఎంపీపీ మహిపాల్ రెడ్డి, సర్పంచుల సంఘం మండలాధ్యక్షుడు కప్పేరి బుచ్చిరెడ్డి, రైతుబంధు అధ్యక్షుడు నర్సింలు, ఉప సర్పంచ్ల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మొగిలి మైపాల్, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీశైలం యాదవ్, కోఆప్షన్ నెంబర్ అల్తాఫ్ బిగ్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బంగారు వెంకటేష్, మరియు వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తల సమక్షంలో శాలువాతో సత్కరించి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి మల్లెపాక యాదయ్య జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ. సమాజంలో యువత పాత్ర ఎంతో ముఖ్యమైందని అందులో యువకుడు యాదయ్య, పార్టీ కార్యక్రమాలలో ముందుండి గ్రామాన్ని అభివృద్ధి పరుస్తూ.
అందరితో కలిసిమెలిసి ఉంటూ పార్టీ కోసం ఇలా కష్టపడే వారికి పార్టీలో గుర్తింపు లభిస్తుందని, మునుముందు యాదయ్య ఇంకా గొప్ప స్థాయికి ఎదగాలని అందుకు నా సహకారంతోపాటు, అందరి ప్రజా ప్రతినిధుల సహకారం పార్టీ సహకారం తప్పక ఉంటుందని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, అన్నారు.