మిర్యాలగూడ డివిజన్ మార్చి 11 తెలంగాణ ఎక్స్ ప్రెస్: మహాత్మ జ్యోతిబాపూలే 197వ జయంతిని పురస్కరించుకుని బీసీ యువజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ సెంటర్లో గల మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా బీసీ యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్ మాట్లాడుతూ మహాత్మ జ్యోతిభా పూలే అణగారిన వర్గాల అసమానతలను రూపుమాపేందుకు అది కేవలం విద్య ద్వారానే సాద్యం అని భావించి అక్షరాలను ఆయుధంగా చేసుకుని వారికి విద్యనేర్పిన గొప్ప మహనీయుడని కొనియాడారు. విద్య ద్వారానే సమాజాన్ని మార్చాలని నిర్ణయుంచుకుని అణిచివేయబడుతున్న అణగారిన వర్గాల జీవితాల్లో అఖండ అక్షరజ్యోతులు వెలిగించిన చైతన్య మహానీయుడు అని అన్నారు. ఆయన ఆశయాలను సాధించే దిశగా అన్నివర్గాల ప్రజలం అడుగులు వేసి సాధించుకొనే విధంగా ప్రయత్నం చేయాలన్నారు. అంతేకాకుండా మహిళలకు విద్య ద్వారానే విముక్తి కలుగుతుందని భావించి తన భార్యకు చదువు చెప్పించి తన ద్వారా మహిళా పాఠశాలలు ఏర్పాటు చేయించి ఎంతో మంది మహిళలకు విద్యనేర్పిన గొప్ప సంఘసంస్కర్త మహాత్మా జ్యోతిభా పూలే అని కొనియాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఫూలే జయంతి రోజున అధికారికంగా సెలవుదినంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి యలిజాల వెంకటేశ్వర్లు, నియోజకవర్గ అధ్యక్షుడు బోళ్ల నాగరాజు, ఉపాధ్యక్షుడు వనం వెంకటేశ్వర్లు, మారోజు రాజ్ కుమార్, కత్తుల సన్నీ తదితరులు పాల్గొన్నారు.