Home తాజా వార్తలు ఈ నెల 5 చివరి తేదీ రైతు బీమాకు నమోదుకు ఏ ఈ ఓ వంశీ

ఈ నెల 5 చివరి తేదీ రైతు బీమాకు నమోదుకు ఏ ఈ ఓ వంశీ

by Telangana Express

ఆకునూర్ క్లస్టర్ ఏ ఈ ఓ వంశీ

సైదాపూర్ ఆగస్టు ,2 (తెలంగాణ ఎక్స్ ప్రెస్)

కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం లోని వివిధ గ్రామాల రైతులు రైతు బీమా కోసం అర్హులై ఉండి 18-59 సంవత్సరాల రైతులందరూ సంబంధిత వ్యవసాయ విస్తీర్ణ అధికారి వద్ద రైతు బీమాను నమోదు చేసుకోవాలని మండల ము లోని ఆకునూరు క్లస్టర్ ఏఈఓ వంశీ తెలియజేశారు. గ్రామాల్లో రైతు వేదికలను సందర్శించి భీమా నమోదు ప్రక్రియను రైతులు నేరుగా రైతు వేదిక వచ్చి లేదా మండల వ్యవసాయ కార్యాలయానికి వచ్చి రైతు బీమా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు . ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు చేసి, కొత్తగా పట్టాదారు పాసుబుక్కు పొంది 15-59 సంవత్సరాలు వయస్సు ఉన్న ప్రతి అర్హులైన రైతులందరూ 1. పట్టాదారు పాసు బుక్కు 2. ఆధార్ కార్డు

  1. నామిని ఆధార్ కార్డు 4. ఎల్ఐసి ఎన్రోల్మెంట్ ఫామ్ లను సంబంధిత వ్యవసాయ విస్తీర్ణ అధికారులకు సమర్పించి ఆగస్టు 5 వ తేదీ లోపు రైతు బీమాకు నమోదు చేసుకోవాలని సూచించారు. అలాగే గతంలో దరఖాస్తు చేసుకున్న రైతు బీమాకు ఏమైనా మార్పులు చేర్పులు ఉన్న సంబంధిత వ్యవసాయ విస్తీర్ణ అధికారులు సంబంధిత వ్యవసాయ అధికారుల ద్వారా నమోదు చేసుకోవాలి అని తెలిపారు.
    మండలంలో కొత్తగా పట్టాదారు పాసుబుక్కులు రైతులు బీమా సౌకర్యం ఉన్నట్లు మరియు మైనర్లుగా ఉండి ఈ సంవత్సరములో మేజర్ గా మారిన రైతులకు కూడా బీమా సౌకర్యం కల్పించబడునని పట్టేదారు పాసుబుక్ ఉండి విదేశాలలో ఉన్న ఎన్నారైలు కూడా తమ సొంత ఊర్లో వచ్చినట్లయితే వారికి కూడా రైతు బీమా నమోదు చేసుకోవాలని ఆకునుర్ క్లస్టర్ ఏఈఓ వంశీ తెలిపారు

You may also like

Leave a Comment