Home తాజా వార్తలు 1962 పశు ఆరోగ్య సేవా సంచార వాహనాలను సందర్శించిన అమెరికా విస్కాన్సిన్ యూనివర్సిటీ బృందం

1962 పశు ఆరోగ్య సేవా సంచార వాహనాలను సందర్శించిన అమెరికా విస్కాన్సిన్ యూనివర్సిటీ బృందం

by Telangana Express

ఘట్కేసర్,నవంబర్ 05(తెలంగాణ ఎక్స్ ప్రెస్)తెలంగాణ ప్రభుత్వం 2017 వ సంవత్సరంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 1962 పశు ఆరోగ్య సంచార వాహన సేవలు జిల్లాలో ఈ.ఏం.ఆర్.ఐ గ్రీన్ హెల్త్ సర్వీసెస్ సంస్థ ఆధ్వర్యంలో 2 వాహనాల ద్వారా మూగజీవాలకు అత్యంత నాణ్యమైన ఆరోగ్య సేవలను అందిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం మొత్తం 100 అంబులెన్స్ వాహనాల ద్వారా 2017 లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరావు ప్రారంభించారు. ఈ పథకం ద్వారా రైతుల వద్ద ఉండే మూగజీవాలకు అత్యంత నాణ్యమైన ఆరోగ్య సేవలను అందిస్తు మన్ననలను పొందుతున్నాయి. ఈ సేవలు ఈ.ఏం.ఆర్.ఐ గ్రీన్ హెల్త్ సర్వీసెస్ సంస్థ తెలంగాణ ప్రభుత్వ సహకారంతో అందించబడుతున్నాయి.
ఇందుకు గానూ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లోని యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్ నుంచి ఒక బృందం 1962 సేవల గురించి తెలుసుకోవటానికి తెలంగాణ రాష్ట్రం కి వచ్చారు. తెలంగాణ రాష్ట్ర 1962 ప్రోగ్రామ్ మేనేజర్ డా.బగిష్ మిశ్రా గారు వారిని సవినయంగా ఆహ్వానించి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పశు ఆరోగ్య సంచార వాహన సేవల గురించి వివరణ ఇవ్వటం జరిగింది, అంతే కాకుండా అమెరికా యూనివర్సిటీ బృందం లోని డాక్టర్స్ ని మన మేడ్చల్ జిల్లాలోని వివిధ గోశాలలకు, మరియు రైతులవద్దకు 1962 పశు ఆరోగ్య సంచార వాహనం లో సంచరించి, సేవలగురించి తెలుసుకొని, మనం అవలంభించే చికిత్స విధానాలను తెలుసుకొని,
వారి దేశంలో వారి చికిత్స విధానాలను మనతో పంచుకోవటం జరిగింది. ఇంత గొప్ప సేవలను అందుబాటులోకి తీసుకొనిరావటం పై వారు హర్షం ప్రకటించారు.


ఈ కార్యక్రమంలోడాక్టర్ బాగీష్ మిశ్రా, డాక్టర్ కీత్ పౌల్సెన్,డాక్టర్ ర్యాన్ బ్రూయర్,డాక్టర్ బాగీష్ మిశ్రా,విస్కాన్సిన్ విశ్వవిద్యాలయం నుండి యూ ఎస్ ఏ,జిల్లా ప్రోగ్రాం మేనేజర్ షేక్ జాన్ షహీద్, జిల్లా మేనేజర్లు రత్నం మరియు తిరుపతి పాల్గొన్నారు…

You may also like

Leave a Comment