Home తాజా వార్తలు ఎల్లారెడ్డి తైబజార్ వేలంలో 12 లక్షల 96 వేల ఆదాయం

ఎల్లారెడ్డి తైబజార్ వేలంలో 12 లక్షల 96 వేల ఆదాయం

by Telangana Express

పశువుల దాఖలు చిట్టి వేలం వాయిదా…
– ఎల్లారెడ్డి మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజు

ఎల్లారెడ్డి, మార్చి12,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):

ఎల్లారెడ్డి మున్సిపాలిటీ తైబజార్ వేలం ద్వారా 12 లక్షల 96 వేల రూపాయల ఆదాయం వచ్చిందని, స్థానిక మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజు తెలిపారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ కుడుముల సత్యనారాయణ అధ్యక్షతన తైబజార్ వేలంపాట నిర్వహించడం జరిగింది. తై బజార్ ( వారాంతపు సంత) కు 4 గురు లక్ష రూపాయల డిపాజిట్, రోజు వారి సంతకు 3 గురు లక్ష రూపాయల నగదు చెల్లించి వేలం పాటలో పాల్గొన్నారు. వారాంతపు సంతకు 7,45,000 వేల రూపాయలకు సయ్యద్ గఫార్, రోజు వారి సంతకు 5,51,000 రూపాయలకు సయ్యద్ గఫార్ దక్కించు కున్నారు. పశువుల సంతకు ఎవ్వరూ కూడా వేలం పాటలో పాల్గొనక పోవడంతో, పశువుల దాఖలు చిట్టి వేలం గురువారం కు వాయిదా వేసినట్లు కమిషనర్ తెలిపారు. వేలం పాట కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ వాసంతి, మున్సిపల్ కార్యాలయం సిబ్బంది సాయిలు, ప్రదీప్, అంజయ్య, సూర్యవర్థన్, సాయిలు తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment