Home తాజా వార్తలు కొండగట్టు దర్శించుకుని తిరుగు ప్రయాణం ఘాట్ రోడ్డులో ఆటో బోల్తా 11 మందికి గాయాలు

కొండగట్టు దర్శించుకుని తిరుగు ప్రయాణం ఘాట్ రోడ్డులో ఆటో బోల్తా 11 మందికి గాయాలు

by Telangana Express

మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట్ దండేపల్లి మండలం మ్షాదరి పెట్ వాసులుగా పోలీసులు గుర్తింపు

మంచిర్యాల, మార్చ్ 09, (తెలంగాణ ఎక్స్ ప్రెస్): జగిత్యాల జిల్లా, కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శించుకుని తిరుగు ప్రయాణం ఘాట్ రోడ్ లో శనివారం ఉదయం ఆటో బోల్తా పడి 11 మంది మంచిర్యాల జిల్లా లక్షింపేట దండేపల్లి మండలం మ్యాదరి పేట వాసులకు తీవ్ర గాయాలైనాయి. పోలీసులు స్థానికుల కథనం ప్రకారం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కొండగట్టు అంజనేయ స్వామి దర్శించుకుని, భక్తులు తిరుగు ప్రయాణంలో ఘాట్ రోడ్డుపై ఆటో బోల్తా పడిన ఘటన శనివారం రోజు ఉదయం చోటు చేసుకుంది. కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకొని ఘాట్ రోడ్ వెంబడ కిందకు దిగుతున్న సమయంలో ఆటో అదుపు తప్పి బోల్తా పడడంతో 11 మందికి గాయాలు, ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్పందించి అంబు లెన్స్ ద్వారా జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి క్షత గాత్రులను తరలించారు. సమాచారం అందుకున్న కొండగట్టు సమీపంలో ఉన్న స్థానిక పోలీసులు ఘాట్ రోడ్డులో ఆటో బోల్తా పడిన సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. ఆంజనేయస్వామి ఘాట్ రోడ్ పై ఆటో బోల్తా పడిన ప్రయాణికులు మంచిర్యాల జిల్లా మ్యాదరిపేట, లక్షేట్ పేట వాసులుగా పోలీసులు గుర్తించారు. కొండగట్టు ఘాట్ రోడ్డు పై ఆటో బోల్తా పడి గాయాలైన ప్రయాణికులకు స్పందించి ప్రభుత్వం వారికి ఆర్థిక సాయం అందజేయాలి.

You may also like

Leave a Comment